Asteroid | న్యూయార్క్, జూలై 6: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పరిమాణంలో ఉండే భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్) ఒకటి భూమిపైకి దూసుకొస్తున్నదని ‘నాసా’ ప్రకటించింది. ‘2024 ఎంటీ1’ అనే పేరు గల ఈ గ్రహ శకలం అంతరిక్షంలో గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొస్తున్నదని నాసా హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆదివారం భూమికి అత్యంత సమీపంగా రానున్నదని తెలిపింది.
దాదాపు 260 మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలాన్ని నాసా ట్రాక్ చేస్తున్నది. వివిధ దేశాల్లోని టెలిస్కోపులు, రాడార్ వ్యవస్థలు కూడా గ్రహ శకలం గమనాన్ని పరిశీలిస్తున్నాయి. ఇది భూమిని దాటుతున్న సమయంలో రెండింటి మధ్య సుమారుగా 15 లక్షల కి.మీ దూరం ఉంటుందని, అయినప్పటికీ భూమిని ఢీ కొనదని కచ్చితంగా చెప్పలేమని సైంటిస్టుల అంటున్నారు.