అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యర్థాలు అనేది పెద్ద సమస్య. ఐఎస్ఎస్లో ఉండే నలుగురు వ్యోమగాములు ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తారు. ఈ వ్యర్థాలను ఐఎస్ఎస్కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్ కార్గో వెహికల్ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కార్గో షిప్ అక్కడికి చేరుకునేవరకు ఈ చెత్తనంతా బ్యాగులో నిల్వ చేస్తున్నారు. అయితే, ఈ సమస్యకు హ్యూస్టన్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ నానోరాక్స్ పరిష్కారం చూపింది. అంతరిక్షంలోనే వ్యర్థాలను కాల్చివేసే కొత్త పరికరాన్ని కనుగొన్నది.
‘బిషప్స్ ఎయిర్‌లాక్’ అనే ఈ పరికరాన్ని నాసాకుచెందిన జాన్సన్ స్పేస్ సెంటర్‌తో కలిసి నానోరాక్స్ సంస్థ తయారుచేసింది. ఈ పరికరంలో ఒకేసారి దాదాపు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్ఎస్లో పోగుపడిన చెత్తను ఈ బిషప్స్ ఎయిర్ లాక్ ఎప్పటికప్పుడు కక్ష్యలోనే సేకరిస్తుంది. అనంతరం వెలుపలి అంతరిక్షంలో మండిస్తుంది. తిరిగి ఐఎస్ఎస్కు చేరుకుంటుంది. ఈ పరికరాన్ని నానోరాక్స్ సంస్థ విజయవంతంగా పరీక్షించింది. ఇది తమ సంస్థకు మరో మైలురాయి అని నానోరాక్స్ సీఈవో డాక్టర్ అమేలా విల్సన్ పేర్కొన్నారు.