బీజింగ్: చాంగే-4 మిషన్‌లో భాగంగా చంద్రుడి మీదకు చైనా పంపించిన యూటూ అనే రోవర్ గత నెలలో ఒక ఫొటో తీసింది. రహస్య గుడిసెను పోలినట్టు ఉన్న ఓ నిర్మాణం ఆ ఫొటోలో కనిపించింది. ఈ ‘మిస్టరీ హట్’పై సామాన్యులతో పాటు శాస్త్రవేత్తల్లో కూడా చర్చ మొదలైంది. దీంతో యూటూ రోవర్‌ను హట్ ఉన్న ప్రాంతానికి మరింత దగ్గరగా తీసుకెళ్లిన చైనా పరిశోధకులు తాజాగా దాని ఫొటో తీశారు. తీరా ఆ ఫొటోను విశ్లేషిస్తే, అది కుందేలు ఆకారాన్ని పోలిన ఓ రాయి అని తేలింది.