Mystery object | ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టరీ వస్తువు.. చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిందేనా?
Mystery object | ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు (Mystery object) కనిపించింది. అయితే చంద్రయాన్- 3 ప్రయోగానికి సంబంధించిందేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువు మాదిరిగా ఒకటి కనిపించింది.
కాన్బెర్రా: ఆస్ట్రేలియా బీచ్‌లో ఒక మిస్టరీ వస్తువు (Mystery object) కనిపించింది. అయితే చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిందేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలోని జురియన్ బే సమీపంలోని బీచ్‌లో రాకెట్ శకలాలకు సంబంధించిన వస్తువు మాదిరిగా ఒకటి కనిపించింది. సముద్రం నుంచి ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఆ వస్తువు ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నది. భారత్ ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఎల్వీఎం రాకెట్ తుది శకలాలుగా అనుమానిస్తున్నారు. చంద్రయాన్-3ను ఎల్వీఎం రాకెట్ నింగిలోకి మోసుకెళ్లిన దృశ్యాలు ఆస్ట్రేలియాలో కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించిన శకలాలే అంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి.
కాగా, ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ కూడా ఈ మిస్టరీ వస్తువుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది. దీని గురించి ఆరా తీస్తున్నట్లు తెలిపింది. విదేశీ అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది కావచ్చని అంచనా వేసింది. సమాచారం కోసం సంబంధిత దేశాలను సంప్రదిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే గుర్తు తెలియని ఆ వస్తువు గురించి పూర్తిగా తెలియనందున దాని వద్దకు వెళ్లవద్దని, తాక వద్దని, కదిలించేందుకు ప్రయత్నించ వద్దని ప్రజలకు సూచించింది. మరోవైపు ఈ మిస్టరీ వస్తువుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
We are currently making enquiries related to this object located on a beach near Jurien Bay in Western Australia.
The object could be from a foreign space launch vehicle and we are liaising with global counterparts who may be able to provide more information.
[More in comments] pic.twitter.com/41cRuhwzZk
— Australian Space Agency (@AusSpaceAgency) July 17, 2023
Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3.
And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE
— Debapratim (@debapratim_) July 17, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

