Delhi Blast | దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రాత్మక ఎర్రకోట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేషన్ (Delhi Blast) దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పేలుడు ఘటనను భారత్‌లోని అన్ని మీడియా సంస్థలు ఫ్రంట్ పేజీలో కవర్ చేశాయి. విదేశీ మీడియా సైతం ఈ పేలుడు ఘటనను విస్తృతంగా కవర్ చేసింది.
ముఖ్యంగా దాయాది పాకిస్థాన్ మీడియా (Pak Media) సంస్థలు ఢిల్లీ పేలుడు ఘటనను తమ ఫ్రంట్ పేజ్‌లో కథనాన్ని ప్రచురించాయి. పాక్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థలు డాన్, జియో న్యూస్, ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్, ద న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్థాన్ టుడే వంటి ప్రముఖ సంస్థలు ఢిల్లీ పేలుడు ఘటనను తమ ఫ్రంట్ పేజీల్లో, వెబ్‌సైట్స్‌లో ప్రచురించాయి. ఈ ఘటనపై హోంమంత్రి అమిత్‌షా, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించినట్లు తమ కథనంలో పేర్కొన్నాయి. ఉగ్రవాద నిరోధక చట్టం (Anti Terror Probe) కింద దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులను ఊటంకిస్తూ రాసుకొచ్చాయి. పలు మీడియా సంస్థలు ‘ఎర్రకోట వద్ద అనుమానాస్పదంగా కారులో పేలుడు’ అంటూ ప్రచురించాయి. ఈ పేలుడుతో భారత ప్రభుత్వం దేశం మొత్తం హైఅలర్ట్ ప్రకటించినట్లు కూడా రాసుకొచ్చాయి.
Also Read..
PM Modi | కుట్రదారులను వదిలే ప్రసక్తే లేదు.. ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోదీ
Delhi Blast | ఢిల్లీ పేలుడు.. ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్తో సంబంధాలు.. ఆ భయంతోనే..!