మయన్మార్‌లో నిరసనకారులపైకి దూసుకెళ్లిన సైనిక వాహనం.. ముగ్గురు మృతి

యాంగోన్: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిరసనకారులను ఆ దేశ సైన్యం అణగదొక్కుతున్నది. తాజాగా ఆదివారం యాంగోన్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక గుంపుమీదకు మిలటరీ వాహనం వెనుక నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మిలటరీ వాహనం దూసుకొస్తుండటాన్ని గమనించిన పలువులు కేకలు వేయడంతోపాటు ఢీకొట్టిన అనంతరం బాధితుల ఆర్తనాదాలు, పరుగులు ఇందులో కనిపించాయి.
నిరసనకారులు రోడ్డుపైకి వచ్చిన రెండు నిమిషాల్లో సైనిక వాహనం వారిపైకి దూసుకొచ్చిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు తెలిపారు. అనంతరం అందులోంచి దిగిన సైనికులు నిరసనకారులను తరిమికొట్టారని చెప్పారు. కాల్పులు జరుపడంతోపాటు వాహనం ఢీకొనడంతో గాయపడిన, తప్పించుకోలేని పది మంది యువతను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1న జరిగిన సైనిక తిరుగుబాటుతో ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఆ దేశ సైన్యం నాటి నుంచి సైనిక పరిపాలన కొనసాగిస్తున్నది. ఇటీవల సూకీపై డజనకుపైగా క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీంతో ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

