వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్) చీఫ్ పదవి నుంచి వైదొలిగారు. ‘డోజ్ చీఫ్‌గా నా పదవీ కాలం ముగిసింది’ అని పేర్కొన్నారు. వృథా వ్యయాన్ని తగ్గించే అవకాశాన్ని తనకిచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు.
డోజ్ మిషన్ రానున్న కాలంలో ప్రభుత్వంలో ఓ జీవన విధానంగా మారుతుందని చెప్పారు. వ్యయ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారని, ఇది డోజ్ చేసిన కృషికి విఘాతమని మస్క్ బుధవారం ట్రంప్‌పై మొదటిసారి విమర్శలు గుప్పించారు.