న్యూఢిల్లీ, డిసెంబర్ 18: బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న అశాంతి పరిస్థితి 1971 విమోచన యుద్ధం తర్వాత భారతదేశానికి ‘అతి పెద్ద వ్యూహాత్మక సవాలు’ను విసురుతోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితి అస్తవ్యస్తత, అరాచకంలోకి దిగజారకపోయినప్పటికీ దానిని ఎదుర్కోవడంలో భారత దేశం జాగ్రత్తగా ఉండాలని కమిటీ తెలిపింది.
ఇస్లామిక్ తీవ్రవాదుల పెరుగుదల, చైనా, పాకిస్థాన్ ప్రభావం తీవ్రమవ్వడం, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఆధిపత్యం కూలిపోవడం వంటి కారణాల వల్లే ఈ అశాంతి నెలకొందని పేర్కొంది.