Gold Mine | మాలీలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి
Gold Mine | పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీ (Mali)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఓ బంగారు గని (Gold Mine) కుప్పకూలింది.
Gold Mine | పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీ (Mali)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఓ బంగారు గని (Gold Mine) కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో సుమారు 70 మందికిపైగా మృత్యువాత పడ్డారు. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనపై ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అనధికారిక మైనింగ్ కారణంగానే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపింది. మైనింగ్ సమయంలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. ఘటన సమయంలో అక్కడ 200 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు అంచనా వేసింది. ఇప్పటి వరకూ 70 మృతదేహాలు బయటపడినట్లు తెలిపింది. మృతుల్లో ఎక్కవగా మైనర్లే ఉన్నట్లు పేర్కొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆఫ్రికాలో టాప్-3 బంగారం ఉత్పత్తిదారుగా ఉన్న మాలిలో ఇలాంటి విషాదాలు సర్వసాధారణమే. మారుమూల ప్రాంతాల్లో భద్రతా చర్యలను పాటించకుండా, అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతుండడం ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం. 2021లో బంగారం ఎగుమతుల్లో మాలి వాటా అధికంగా ఉందని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాలు చెబుతున్నాయి.
Also Read..
Salary | రెండు నెలలైనా రాని జీతాలు.. అవస్థలు పడుతున్న కాంట్రాక్టు లెక్చరర్లు
IND vs ENG | మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు.. ఇంగ్లండ్ స్కోర్..?
Kangana Ranaut | డేటింగ్లో ఉన్నది నిజమే.. కానీ అతడుకాదు: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

