శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Sep 12, 2020 , 15:42:13

కాంగోలో కూలిన బంగారు గని.. 50 మంది దుర్మరణం..?

కాంగోలో కూలిన బంగారు గని.. 50 మంది దుర్మరణం..?

కిన్షాసా : డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పున ఉన్న కమితుగా సమీపంలోని ఓ బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 50 మంది యువకులు దుర్మరణం చెందారని స్థానిక మైనింగ్‌ స్వచ్ఛంద సంస్థ చెబుతోంది. శుక్రవారం మధ్యాహ్నం (స్థానిక సమయం) భారీ వర్షాల కారణంగా డెట్రాయిట్ గని సైట్‌ వద్ద ఈ ప్రమాదం సంభవించిందని ఇనిషియేటివ్ ఆఫ్ సపోర్ట్ అండ్ సోషల్ సూపర్ విజన్ ఆఫ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎమిలియానే ఇటోంగ్వా తెలిపారు. చాలామంది మైనర్లు, యువకులు షాప్ట్‌లో ఉన్నారని, గని గోడలు కూలడంతో ఎవరు బయటకు రాలేకపోయారని ఆమె తెలిపారు. కమితుగా మేయర్ అలెగ్జాండర్ బుండ్యా మాట్లాడుతూ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా కచ్చితంగా తెలియదని పేర్కొన్నారు.

సుమారు 50 మంది వరకు ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. కుండపోత వర్షం, మూడు సొరంగాల్లోకి నీరు పోవడంతో కూలిపోయిందని స్థానికులు మీడియాకు తెలిపారు. ‘ఈ విపత్తుకు కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరగాలి’ అని పౌర సమాజ ప్రతినిధి నికోలస్ కయాలంగలిల్వా అన్నారు. కాంగోలో అనియంత్రిత గనుల్లో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణం. ప్రతి సంవత్సరం డజన్ల కొద్దీ గనుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అక్కడ తరచూ అ౦తకుము౦దు భూగర్భ౦లో ఉన్న త్రవ్వకాలు జరుగుతున్నాయి.  గత ఏడాది అక్టోబర్‌లో ఒక నిరుపయోగమైన బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి 16 మంది మరణించగా, జూన్ 2019లో కాపర్, కోబాల్ట్ గనివద్ద మరో కొండచరియలు విరిగిపడి 43 మంది గని కార్మికులు మరణించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo