WHO | జెనీవా: వయోజనులకు తొలి ఎంపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతిని ఇచ్చింది. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల్లో వ్యాధిపై పోరాడటానికి ఇది ముఖ్యమైన చర్యగా అభివర్ణించింది. టీకా కూటమి గవి, యూనిసెఫ్ లాంటి దాతలు ఈ టీకాను కొనుగోలు చేసి ఆఫ్రికా దేశాలకు అందించవచ్చని సూచించింది.
అయితే టీకా తయారీదారు ఒకరే ఉండటంతో సరఫరా పరిమితంగా ఉందని తెలిపింది. అవసరం ఉన్నచోట అత్యవసరంగా టీకా కొనుగోలు చేసి సరఫరా చేయాలని దాతలకు డబ్ల్యూహెచ్వో పిలుపునిచ్చింది. గత వారం ఎంపాక్స్ కారణంగా ఆఫ్రికా ఖండంలో 107 మరణాలు, 3160 కొత్త కేసులు నమోదయ్యాయి.