వయోజనులకు తొలి ఎంపాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతిని ఇచ్చింది. ఆఫ్రికా, ఇతర ప్రాంతాల్లో వ్యాధిపై పోరాడటానికి ఇది ముఖ్యమైన చర్యగా అభివర్ణించింది.
ఎంపాక్స్ కొత్త కొవిడ్ కాదని, దాని వ్యాప్తిని అరికట్టడంలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు కీలకమని డబ్ల్యూహెచ్వో యూరప్ ప్రాంతీయ సంచాలకులు హన్స్ క్లుగె మంగళవారం తెలిపారు.