MPox | కరోనా కంటే.. ఎంపాక్స్ ప్రమాదకరమా..? నిపుణులు ఏమంటున్నారంటే..?
MPox | ప్రపంచంలోని చాలాదేశాల్లో ఈ రోజుల్లో ఎంపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ అనంతరం వైరస్ ఆసియా దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఎంపాక్స్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది.
MPox | ప్రపంచంలోని చాలాదేశాల్లో ఈ రోజుల్లో ఎంపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ అనంతరం వైరస్ ఆసియా దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఎంపాక్స్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇప్పటికే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు. వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధ్యయనాల ప్రకారం.. ఎంపాక్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో పాటు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్నది. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఇన్ఫెక్షన్ భారీగా విస్తరించేందుకు అవకాశం ఉన్నది.
ఇటీవలి నివేదికల ప్రకారం.. పాకిస్థాన్, స్వీడన్లోనూ కేసులు రికార్డయ్యాయి. పొరుగు దేశంలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఆరోగ్య ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా సీనియర్ అధికారులతో సైతం సమీక్ష నిర్వహించారు. అయితే, భారత్లో ఎంపాక్స్ వ్యాధి నమోదుకాకపోవడం ఉపశమనం కలిగించే విషయం. వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా వైరస్ కంటే ఎంపాక్స్ ప్రమాదకరమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, కొవిడ్ కారణమయ్యే వైరస్ సార్స్ కోవ్-2, ఎంపాక్స్ వైరస్ చాలా రకాలుగా విభిన్నంగా ఉన్నాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రెండు వైరస్లు జూనోటిక్ వ్యాధులే. అంటే జంతువల నుంచి మనుషులకు వ్యాప్తిస్తాయి. సార్స్ కోవ్-2 వైరస్ గబ్బిలాల్లో, ఎంపాక్స్ తొలిసారిగా కోతుల్లో గుర్తించారు.
యూఎస్ ఆధారిత యూనివర్సిటీ హాస్పిటల్స్ రెయిన్బో బేబీస్ అండ్ చిల్డ్రన్స్లో ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ అమీ ఎడ్వర్డ్స్ కొవిడ్-19 కంటే ఎంపాక్స్తో తక్కువ ప్రమాదం ఉంటుందని.. ఇందులో కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయన్నారు. ఎంపాక్స్ సులభంగా వ్యాపించదు. సోకిన వ్యక్తులను గుర్తించడం సులభమే. దీనికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉన్న రెండు టీకాలున్నాయి. కొవిడ్ మాదిరిగా కాకుండా ఎంపాక్స్ అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులకు మాత్రమే సోకే ప్రమాదం ఉంటుంది. దగ్గరి కాంటాక్టులను గుర్తించి చికిత్స అందించడం సులభమే. శరీర ద్రవాలు, గాయాలతో ప్రత్యక్ష సంవ్ద్వారా మరొకరికి వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్ముల ద్వారా విడుదలయ్యే తుంపర్లు, కలుషితమైన బట్టల కారణంగా సైతం సోకేందుకు అవకాశం ఉంటుంది. కొవిడ్ తరహాలో గాలి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం లేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి దుడ్డు ఆకాశ్
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

