Bangladesh | బంగ్లాదేశ్‌లో (Bangladesh) మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే, ఈ సారి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనకారులు (Bangladesh protests) ఆందోళన చేపట్టారు. రాజధాని ఢాకాలోని అంతర్జాతీయ కంపెనీలపై దాడులు చేసి దోచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#BREAKING 🚨
In Bangladesh, Islamists are openly rallying for Hamas, vandalizing places like KFC, and calling for boycotts of U.S. and Israeli products. Despite the chaos, authorities have taken no action as anti-Israel , anti-America and anti-India slogans continue to spread.… pic.twitter.com/IRNDXxZ0DM— Voice of Bangladeshi Hindus 🇧🇩 (@VHindus71) April 7, 2025
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడిని ముమ్మరం చేయడంతో పాలస్తీనియన్లకు సంఘీభావంగా సిల్హెట్, చట్టోగ్రామ్, ఖుల్నా, బారిషల్, కుమిల్లా, ఢాకాలో వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నాయని భావించి బాటా (Bata), కేఎఫ్‌సీ (KFC), పిజ్జా హట్, పూమా, డొమినోస్ వంటి అంతర్జాతీయ సంస్థలను నిరసన కారులు లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. ఆయా దుకాణాలను ధ్వంసం చేసి దోచుకున్నారు. ఇందుకు సంబధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
This is the so called “Students Revolution” in Bangladesh. Seen here looting a Bata footwear store. Earlier they looted women undergarments and food from the official house of Sheikh Hasina in August 2024. Coward illiterate yet radical Islamist thugs! pic.twitter.com/lQuYkNP8gx
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 9, 2025
Also Read..
Donald Trump | అతి త్వరలో ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు.. మరో బాంబు పేల్చిన ట్రంప్
Fire | చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. 20 మంది సజీవ దహనం