Donald Trump | గల్లంతైన పైలట్‌ను రక్షించాం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన
Donald Trump | ఇరాన్ (Iran) తో జరుగుతున్న యుద్ధంలో ఇటీవల అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమానం ‘F-15E స్ట్రైక్ ఈగల్’ కూలిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన రెండో పైలట్‌ను తాజాగా అమెరికా దళాలు గుర్తించి రక్షించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు.
Donald Trump : ఇరాన్ (Iran) తో జరుగుతున్న యుద్ధంలో ఇటీవల అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమానం ‘F-15E స్ట్రైక్ ఈగల్’ కూలిపోయింది. ఈ ఘటనలో గల్లంతైన రెండో పైలట్‌ను తాజాగా అమెరికా దళాలు గుర్తించి రక్షించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. దేశ చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్‌ను తమ సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందని అన్నారు. ప్రస్తుతం ఆ పైలట్ అమెరికా బలగాల ఆధీనంలోనే సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.
ఇరాన్‌లోని ప్రమాదకరమైన పర్వతాల్లో అతడిని గుర్తించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఓ వైపు శత్రువులు అతడి కోసం వేట సాగిస్తుంటే మరోవైపు అతడి కమాండర్ ఇన్ చీఫ్, యుద్ధ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఇతర అమెరికా యోధులు అతడి లొకేషన్‌ను 24 గంటలూ గమనిస్తూనే ఉన్నారని వెల్లడించారు. పైలట్‌ను తీసుకురావడానికి తాను డజన్ల కొద్దీ విమానాలను పంపానని, తమ రక్షణ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఈ విషయాన్ని బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.
శత్రు భూభాగంలోకి వెళ్లి ఎయిర్‌మెన్ రక్షించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారని ట్రంప్ పేర్కొన్నారు. ఏ అమెరికన్ యోధుడిని ఎప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టమని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇరాన్ గగనతలంపై తాము తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించామనడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

