America | మిన్నెసోటా స్టేట్ మాజీ హౌస్ స్పీకర్ మెలిస్సా హోర్ట్‌మన్ ఆమె భర్త తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర గవర్నర్ టిమ్ వాల్జ్ పేర్కొన్నారు. ఇదే దాడిలో సెనేటర్ జాన్ హాఫ్మన్, అతని భార్య య్వెట్ సైతం గాయపడ్డారు. హాఫ్ మాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. రాజకీయ కారణాలతోనే దాడి జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. మెలిస్సా హోర్ట్‌మన్ స్టేట్ మాజీ హౌస్ స్పీకర్, డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నాయకురాలు. 2004లో ఆమె తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె మిన్నెసోటాలో ప్రముఖ రాజకీయ నేతల్లో ఒకరు. ఉత్తర మిన్నియాపాలిస్ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించారు. ఆమె మిన్నెసోటా డెమోక్రటిక్-ఫార్మర్-లేబర్ పార్టీ సభ్యురాలు కూడా.
మెలిస్సా బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. పొలిటికల్ సైన్స్, తత్వశాస్త్రంలో పట్టభద్రురాలయ్యారు. ఆ తర్వాత మిన్నెసోలా లా స్కూల్లో చదివారు. ఆ తర్వాత కెన్నడి స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్ కోసం హార్వర్డ్‌లో చేరారు. ఆమె కళాశాలలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెలిస్సా హోర్ట్‌మన్ యునైటెడ్ స్టేట్స్ సెనేట్‌లో అల్ గోర్, జాన్ కెర్రీలకు ఇంటర్న్‌గా పనిచేశారు. లా స్కూల్లో ఉన్నప్పుడు జడ్జి జాన్ సోమర్విల్లేకు క్లర్క్‌గా పనిచేశారు. ఆమె బ్రూక్లిన్ పార్క్ సిటీ హ్యూమన్ రిలేషన్స్ కమిషన్లోనూ సేవలందించారు. హెన్నెపిన్ కౌంటీకి అసిస్టెంట్ కౌంటీ అటార్నీగా పనిచేశారు. మెలిస్సా 2004లో మిన్నెసోటా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ప్రతి రెండుసంవత్సరాల కోసం తిరిగి ఎన్నికయ్యారు.
తొలిసారి 1998లో, 2022లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె ఓసారి అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీ సభ్యురాలు స్టెఫానీ ఓల్సెన్ను ఓడించారు. ఇదిలా ఉండగా.. సెనేటర్ జాన్ హాఫ్మన్, అతని భార్య కాల్పుల్లో గాయపడ్డగా.. ప్రమాదం తప్పింది. హాఫ్మన్ 2012 నుంచి సెనేట్‌లో ఉన్నారు. ఘటనపై మిన్నెసోటా బ్యూరో ఆఫ్ క్రిమినల్ అప్రెహెన్షన్ (BCA) అధిపతి డ్రూ ఎవాన్స్ మాట్లాడుతూ.. నిందితుడు పోలీస్ యూనిఫాంలో వచ్చి కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ సేఫ్టీ కమిషనర్ బాబ్ జాన్సన్ మాట్లాడుతూ.. రక్షణకు చిహ్నంగా నిలిచే యూనిఫామ్‌ను దుర్వినియోగం చేయడం ఆందోళనకరమన్నారు. మెలిస్సా హోర్ట్‌మన్, ఆమె భర్త కాల్పుల్లో మరణించారని ఎవాన్స్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. అనుమానితుడి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
Walz announces that Rep. Melissa Hortman is dead as a result of a “politically motivated assassination” pic.twitter.com/BBTAhTmseV
— Aaron Rupar (@atrupar) June 14, 2025