కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీపై ఇవాళ రష్యా దాడి చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. హై ప్రిసిషన్ మిస్సైళ్లతో 16 శత్రు టార్గెట్లను ధ్వంసం చేసినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఇగర్ కొనషెంకోవ్ తెలిపారు. సైనిక వస్తువులు, వేర్‌హౌజ్‌లు, ఆయుధ బండాగారాలను పేల్చివేసినట్లు రష్యా ప్రతినిధి చెప్పారు. కీవ్‌తో పాటు మైకోలైవ్‌లో ఉన్న మిలిటరీ ఎక్విప్మెంట్ రిపేర్ షాపును కూడా క్షిపణతో దాడి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్‌పై దాడులను ఉధృతం చేయనున్నట్లు శుక్రవారం రష్యా చెప్పిన విషయం తెలిసిందే. మాస్క్వా యుద్ధనౌకను కూల్చిన తర్వాత రష్యా మరింత ప్రతీకారేచ్చను ప్రదర్శిస్తోంది.