వాషింగ్టన్ : తమ కంపెనీలో ఉద్యోగాల కోతలు, సంస్థాగత పునర్ నిర్మాణం జరిగిన కొన్ని నెలల తర్వాత మళ్లీ ఉద్యోగుల నియామకానికి సిద్ధంగా ఉన్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. ఈసారి కృత్రిమ మేధ(ఏఐ) కేంద్రంగా తమ వృద్ధి వ్యూహం ఉంటుందన్నారు.
తమ తదుపరి ఉద్యోగ నియామక ప్రక్రియ ఏఐ ముందు కాలం కంటే భిన్నంగా ఉంటుందని.. సామర్థ్యం, సాంకేతికత చోదకంగా గల వృద్ధిపై దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు.