ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన రష్యా.. సైన్యంతోనే కాకుండా పలు దేశాలపై సైబర్ దాడులకు కూడా తెగబడిందట. ఈ విషయాన్ని ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, అమెరికా లక్ష్యాలుగా.. రష్యాకు చెందిన మిలటరీ గూఢచారులు సైబర్ దాడులకు యత్నించారని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
అయితే ఈ దాడులను తాము సమర్ధవంతంగా తిప్పికొట్టామని వెల్లడించింది. ఉక్రెయిన్‌కు చెందిన మీడియా సంస్థలు.. అమెరికా, ఈయూకు చెందిన ప్రభుత్వ వ్యవస్థలు, థింక్ ట్యాంకులపై రష్యాకు చెందిన గూఢచారుల బృందం సైబర్ దాడి చేసిందట.
ఏడు ఇంటర్నెట్ డొమైన్లను ఉపయోగించే ఈ బృందాన్ని ‘‘స్ట్రోనియం’’ అని పిలుస్తున్నారట. అయితే వీళ్లు టార్గెట్ చేసిన సంస్థల పేర్లను మాత్రం మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. ఈ విషయంపై వాషింగ్టన్‌లోని రష్యన్ ఎంబసీ దీనిపై స్పందించలేదు.