సీటెల్: సాఫ్ట్వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కరోనా బారిన పడ్డారు. తనకు తేలికపాటి కరోనా లక్షణాలున్నాయని స్వయంగా వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారేవరకు తాను ఐసోలేషన్‌లోనే ఉంటానని ట్వీట్ చేశారు. తాను వైద్యుల సలహాలను అనుసరిస్తున్నానని పేర్కొన్నారు. తాను పూర్తిస్థాయిలో కరోనా టీకాలు తీసుకున్నాని వెల్లడించారు.
I've tested positive for COVID. I'm experiencing mild symptoms and am following the experts' advice by isolating until I'm healthy again.
— Bill Gates (@BillGates) May 10, 2022
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందజేసింది. అదేవిధంగా యాంటీవైరల్ జనరిక్ కరోనా పిల్స్‌ను సరఫరా చేసేందుకు తన ఫౌండేషన్ తరపున 120 మిలియన్ల డాలర్లను బిల్‌గేట్స్ వెచ్చించారు.