వాషింగ్టన్: 2014 జనవరిలో రోదసి నుంచి 1.5 అడుగుల సైజు ఉన్న ఓ ఉల్క భూమిపై పడింది. అయితే, ఆ శకలంలోని పదార్థం, మూలకాలు భిన్నంగా ఉండటంతో ఈ ఉల్క ఎక్కడ నుంచి వచ్చిందన్న ప్రశ్నలు శాస్త్రవేత్తల మెదళ్లను తొలిచివేశాయి. ఎనిమిదేండ్ల తర్వాత ఆ ఉల్క గుట్టువీడింది. భూమికి లక్షల కిలోమీటర్ల దూరం లో ఉన్న మరో సౌరకుటుంబం నుంచి ఆ ఉల్క పడినట్టు యూఎస్ స్పేస్ కమాండ్ శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. భూమిపై పడిన తొలి ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్ కూడా ఇదేనని వెల్లడించారు. రెండు నక్షత్ర మండలాల మధ్య, ఎలాంటి గురుత్వాకర్షణ శక్తికి ప్రభావితం కాకుండా తిరిగే వస్తువులను ఇంటర్స్టెల్లార్ ఆబ్జెక్ట్స్ అంటారు.