శనివారం 30 మే 2020
International - Apr 17, 2020 , 19:15:14

మీకోసం అమెరికా ప్రార్థిస్తున్న‌ది: మెలానియా

మీకోసం అమెరికా ప్రార్థిస్తున్న‌ది: మెలానియా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ బారినపడ్డ బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ఆయ‌న సతీమ‌ణి సైమండ్స్‌ త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్య‌క్ష‌డు డొనాల్డ్ ట్రంప్ స‌తీమ‌ణి మెలానియా ట్రంప్‌ ఆకాంక్షించారు. బోరిస్‌ జాన్సన్‌ భార్య గర్భవతి కావడంతో ఆమెతో ఫోన్‌లో మాట్లాడిన మెలానియా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని దంపతులు సాధ్యమైనంత తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా, బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌ ఇటీవ‌ల క‌రోనా బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తాను కూడా కరోనా లక్షణాలతో బాధపడినప్పటికీ ప్రస్తుతం కోలుకున్నాన‌ని బోరిస్‌ జాన్సన్‌ భార్య సైమండ్స్ కూడా ప్ర‌క‌టించారు. 


logo