Rupert Murdoch | ఆస్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) 92 ఏండ్ల వయసులో ఐదో పెండ్లికి సిద్ధమవుతున్నారు. తన ప్రియురాలు అయిన 65 ఏండ్ల యాన్ లెస్లీ స్మిత్ (Ann Lesley Smith)ను ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. మార్చి 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్లో వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. ‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు’ అని రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు. నాలుగో భార్య అయిన జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకుని ఏడు నెలలు కూడా పూర్తికాకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
మరోవైపు లెస్లీ స్మిత్ (Ann Lesley Smith) భర్త కూడా ఓ వ్యాపారవేత్తనే. 14 ఏండ్ల క్రితమే ఆయన చనిపోయారు. అప్పటి నుంచి ఒంటిరగా ఉన్న లెస్లీ.. మర్దోక్ చేసిన పెండ్లి ప్రతిపాదనకు అంగీకారించింది. ఆయనతో జీవితం పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
మర్దోక్ మొదటిసారి ఆస్ట్రేలియాకు చెందిన ఫ్లైట్ అటెండెంట్ పాట్రీషియా బుకర్ (Patricia Booker)ను 1956లో వివాహం చేసుకున్నారు. వీరు 1967 వరకు కలిసే ఉన్నారు. అనంతరం విడిపోయారు. ఆ తర్వాత అన్నా మరియా మన్ (Anna Maria) ను వివాహం చేసుకుని.. 30 ఏళ్ల తర్వాత 1999లో ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత వెండీ డెంగ్ (Wendi Deng )ని పెళ్లిచేసుకుని.. 2013 వరకూ కాపురం చేశారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత 2016లో జెర్రీ హాల్ (65)ను నాలుగో వివాహం చేసుకున్నారు. ఆమెను పెళ్లాడిన.. ఆరేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐదోసారి లెస్లీ స్మిత్‌తో వివాహానికి సిద్ధమయ్యారు.
కాగా, రెండో భార్య అన్నా మరియా మన్ నుంచి విడిపోయిన సందర్భంలో మర్దోక్ చెల్లించిన భరణం అత్యంత ఖరీదైనవాటిల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం. మర్దోక్, స్మిత్‌ల వివాహం ఈ వేసవిలో జరగనుండగా.. అమెరికా, బ్రిటన్‌లో గడపాలని కొత్త జంట భావిస్తోంది.
Also Read..
Amazon Layoffs | ఉద్యోగులకు మరోసారి షాకిచ్చిన అమెజాన్
Paul Grant | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
Hyderabad | మారుతున్న ఓఆర్ఆర్ రూపురేఖలు.. హైదరాబాద్‌కు నయా ఐకానిక్‌గా నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్