Amazon Layoffs | ఉద్యోగులకు మరోసారి షాకిచ్చిన అమెజాన్
Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ (Amazon) సంస్థ.. తాజాగా మరో సారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది.
Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ (Amazon) సంస్థ.. తాజాగా మరో సారి ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్ (Amazon).. తాజాగా మరో 9వేల మందికి ఉద్యాసన పలకనుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో యాండీ జెస్సీ (CEO Andy Jassy) ఒక ప్రకటనలో వెల్లడించారు.
‘రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉండటంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నాం. అందులో భాగంగా మరికొంతమంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించాం. వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. త్వరలోనే దీనిపై ఉద్యోగులకు సమాచారం అందిస్తాం’ అని జెస్సీ (Andy Jassy) చెప్పారు. అమెజాన్ రెండో విడత వార్షిక ప్రణాళిక ప్రక్రియ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.
తాజా లేఆఫ్స్ (Layoffs) తో ఈ సంవత్సరం ఇప్పటివరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించినట్టయింది. ఒక పక్క ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ.. మరోపక్క కొత్త నియామకాలు ఆగవని ఈ సందర్భంగా జెస్సీ చెప్పారు. అయితే ఆ నియామకాలు వ్యూహాత్మకంగా కీలకమైన విభాగాల్లో మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు.
అమెజాన్ తాజా నిర్ణయంతో క్లౌడ్ కంప్యూటింగ్, మానవ వనరుల విభాగం, ప్రకటనలు, ట్విచ్ లైవ్‌స్ట్రీమింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు.
Also Read..
Hina Khan | సరికొత్త పోజులతో మదిని దోచుకుంటున్న హీనా ఖాన్..
Summer | కిడ్నీల్లో రాళ్లు ఎండాకాలంలోనే ఎందుకు ఎక్కువగా వస్తాయి? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?
Hyderabad | మారుతున్న ఓఆర్ఆర్ రూపురేఖలు.. హైదరాబాద్‌కు నయా ఐకానిక్‌గా నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

