రియాద్ విమానాశ్రయంపై దాడి?
సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శనివారం భారీగా నల్లని పొగలు, మంటలు కనిపించాయి. ఈ ఘటనతో విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు ‘రాయిటర్స్' పేర్కొన్నది. సౌదీ అరేబియాలో వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ చేసిన కొద్ద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకు దారి తీసింది.
- ఎయిర్పోర్ట్ సమీపంలో భారీగా పొగలు
- విమాన సర్వీసులు రద్దు!
రియాద్: సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో శనివారం భారీగా నల్లని పొగలు, మంటలు కనిపించాయి. ఈ ఘటనతో విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు ‘రాయిటర్స్’ పేర్కొన్నది.
సౌదీ అరేబియాలో వైమానిక ముప్పు హెచ్చరికలు జారీ చేసిన కొద్ద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళనకు దారి తీసింది. అయితే ఈ మంటలు, పొగలకు కారణమేమిటన్నది అధికారికంగా వెల్లడికాలేదు. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో రియాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు.
రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మంటలు ఎగసిపడటంతోపాటు దట్టమైన నల్లని పొగలు ఆకాశంలో వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానాల ట్రాకింగ్ డాటా ప్రకారం రియాద్ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కొన్ని విమానాలు గణనీయంగా ఆలస్యమైనట్లు సమాచారం. అలాగే విమానాశ్రయంలోని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తున్నది. కాగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల్లో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
రైతులకు డీఏవో పుల్లయ్య పెసర విత్తనాలు పంపిణీ
రాంపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Srikanth Odela | ఒక్క ఫ్లాప్‌తో శ్రీకాంత్ ఓదెలపై నెగెటివ్ ప్రచారం.. చిరంజీవి సినిమా ఆగిపోయిందా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

