బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో భారీ వరదలు 145 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ థాయ్‌లాండ్‌లోని 12 ప్రావిన్స్‌లలో ఆకస్మికంగా కురిసిన భారీ వానలకు 12 లక్షల గృహాలు ప్రభావితం కాగా, 36 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఇటీవలి కాలంలో ఇంత భారీ వరదను చూడలేదని పౌరులు వాపోయారు. ఆస్తి, మౌలిక సదుపాయాలకు భారీ నష్టం ఏర్పడింది.