Sydney | ఆస్ట్రేలియా (Australia) లోని సిడ్నీ (Sydney)లో గురువారం భారీ అగ్నిప్రమాదం (Massive Fire) చోటు చేసుకుంది. నగరంలోని ఓ ఏడు అంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సుమారు 100 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సర్రీ హిల్స్ (Surry Hills)లో 7 అంతస్తుల భవంతిలో గురువారం ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అవి పక్కనున్న భవనాలకు కూడా వ్యాపిస్తున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters ) వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 100 మంది అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల ధాటికి భవనం పూర్తిగా కాలిపోయి కూప్పకూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక కార్యకలాపాలు కొనసాగుతున్నందున ఈ ప్రాంతంలోకి ప్రజలు ఎవరూ రావొద్దని అధికారులు తెలిపారు.
Also Read..
Kerala State Lotteri | కేరళ లాటరీ డ్రా.. రూ.12 కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి
Cannes 2023 | కేన్స్‌లో సన్నీ, అదితి, శృతి మెరుపులు.. ఫొటోలు వైరల్
India Corona | మరోసారి 500కి పైనే కొత్త కేసులు.. ఐదు మరణాలు