Cannes 2023 | ఫ్రాన్స్ (France) వేదికగా 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (76th annual Cannes Film Festival) అట్టహాసంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ (Red Carpet)పై హొయలు పోతున్నారు. మన దేశం నుంచి కూడా కొందరు తారలు ఈ వేడుకకు హాజరై రెడ్ కార్పెట్‌పై హొయలొలికించారు.
బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) , సారా అలీఖాన్, ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), ఊర్వశీ రౌతెలా, ఈశా గుప్తా, మానుషీ చిల్లర్ తదితరులు ఇప్పటికే రెడ్‌కార్పెట్‌పై సందడి చేశారు. తాజాగా, సన్నీ లియోన్ (Sunny Leone), అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari), శృతిహాసన్ (Shruti Haasan) కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో స్టన్నింగ్ లుక్స్‌తో రెడ్ కార్పెట్‌పై హొయలు పోతూ అందరినీ ఆకట్టుకున్నారు. సన్నీ పింక్ కలర్ డ్రెస్‌లో హొయలుపోగా.. అదితి బ్లూ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌తో సందడి చేసింది. ఇక శృతిహాసన్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్రెస్‌లో మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తారల ఫ్యాషన్ లుక్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Also Read..
Kerala State Lotteri | కేరళ లాటరీ డ్రా.. రూ.12 కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి
Adah Sharma | కేరళ స్టోరీ నటికి షాక్.. నెట్టింట ఫోన్‌నంబర్ లీక్
Manipur Violence | అల్లర్లతో ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు.. రూ.1800 చేరిన వంట గ్యాస్