Mass shooting | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు (Mass shooting) చోటు చేసుకున్నాయి. ఫిలడెల్ఫియా (Philadelphia)లోని ప్రఖ్యాత ఫెయిర్మౌంట్ పార్క్ (Fairmount Park)లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
లెమన్ హిల్ డ్రైవ్లో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పార్కులో సేదతీరుతున్నారు. ఆ సమయంలో అక్కడ కాల్పులు జరిగినట్లు పోలీసులను ఊటంకిస్తూ రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. మృతులు ఇద్దరూ మైనర్లే అని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Friendship | పక్షుల్లోనూ దీర్ఘకాల మైత్రి.. మనుషుల్లానే పరస్పరం సహకరించుకుంటాయట!