ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్(Masood Azhar) తాజాగా ఓ ఆడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జైషే సంస్థలో వేల సంఖ్యలో సూసైడ్ బాంబర్లు ఉన్నారని, వాళ్లు దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే ఆ ఆడియో ఎప్పడు రిలీజైందన్న విషయంపై స్పష్టత లేదు. అధికారులు కూడా దానిపై ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జైషే సంస్థలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వందలు కాదు, వేల మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ వాస్తవ సంఖ్యను చెబేత అప్పుడు తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతుందన్నారు. తన సంస్థకు చెందిన వ్యక్తులు డబ్బులు కోసమో, వీసాలు, వ్యక్తిగత లాభాల కోసం పోరాటం చేపట్టరని, కేవలం వీర మరణం పొందాలనుకుంటారన్నారు. ఢిల్లీలోని పార్లెమట్ భవనంపై 2021లో జరిగిన దాడికి ప్రధాన సూత్రధారుడు మసూద్ అజార్.