న్యూఢిల్లీ : మనలో చాలా మందికి ఉదయాన్నే టీ (Masala Chai) తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఛాయ్ అని పిలుచుకునే తేనీరుని ఆస్వాదించని వారు అరుదు. పని ప్రదేశాల్లో, రోడ్ పక్కన స్టాల్స్‌లో ఛాయ్ అనేది ప్రజలను ఒక్కచోటకు చేర్చుతుంది. ఇక మసాలా ఛాయ్ అంటే వింటర్లో వేడివేడిగా గొంతులో దిగుతూ శరీరాన్ని వేడిగా ఉంచడంతో పాటు రోజంతా పనిచేసే శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తుంది. అలాంటి మన మసాలా ఛాయ్ ప్రపంచంలోనే ఉత్తమమైన నాన్ ఆల్కహాలిక్ పానీయాల జాబితాలో రెండో స్ధానంలో నిలిచింది.
టేస్ట్అట్లాస్ ప్రకటించిన ర్యాంకింగ్స్ డీల్స్‌లో మన మసాలా ఛాయ్‌కు టాప్ టూ స్ధానం దక్కింది. భారత్‌కు చెందిన ఛాయ్ మసాలా మెరుగైన పానీయం. బ్లాక్ టీ, పాలతో పాటు అల్లం, మిరియాల పొడి, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క వంటి మసాల దినుసుల మిశ్రమంతో దీన్ని రూపొందిస్తారని టేస్ట్అట్లాస్ ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చింది. ఇక మెక్సికోకు చెందిన అగాస్ ఫ్రెస్కాస్ ఈ జాబితాలో ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచింది.
పండ్లు, పూలు, కుకుంబర్స్, సీడ్స్, సిరిల్స్, షుగర్, వాటర్‌తో ఈ పానీయాన్ని తయారు చేస్తారు. మన దేశానికి చెందిన మ్యాంగో లస్సీ మూడో స్ధానం దక్కించుకుంది. అంతకుముందు ప్రపంచంలోనే అత్యుత్తమ డైరీ పానీయంగానూ మ్యాంగో లస్సీ ఘనత సాధించింది. ఇక ప్రపంచంలో అత్యుత్తమ రైస్‌గా మన బాస్మతి రైస్ అరుదైన ఘనతను అందుకుంది.
Read More :