Whole Grains : పలు పోషకాలు కలిగిన తృణధాన్యాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. తృణధాన్యాల ప్రాధాన్యతను, శరీరంపై అవి చూపే ప్రభావం గురించి నిపుణులు ప్రస్తావిస్తుంటారు. 2024లో మెరుగైన ఆహారంగా ఎంపికైన మెడిటేరేనియన్ డైట్లో తృణధాన్యాలు అంతర్భాగంగా ఉన్నాయి. ఫైబర్, నియాసిన్, థైమిన్, ఫోలేట్ వంటి బీ విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం వంటి విటమిన్స్ సహా తృణధాన్యాలు పోషకాల పవర్‌హౌస్‌గా పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
వీటిలో ప్రొటీన్, ఫైటిక్ యాసిడ్, లిగ్నాన్స్, ఫురులిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉన్నాయి. ఉదాహరణకు డ్రై ఓట్స్ సింగిల్ ఔన్స్‌లో 3 గ్రాముల ఫైబర్, రోజుకు సరిపడినంత మాంగనీస్, ఫాస్పరస్, ఇతర కీలక పోషకాలు లభ్యమవుతాయి. తృణధాన్యాలు నిత్యం తీసుకుంటే హృద్రోగ ముప్పు గణనీయంగా తగ్గుతుంది. రోజూ 28 గ్రాముల తృణధాన్యాలు తీసుకుంటే హృద్రోగ ముప్పు 22 శాతం తగ్గుతుందని అధ్యయనాలు వెల్లడించాయి.
కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను మెరుగుపరిచి, బీపీని తగ్గించడంలో తృణధాన్యాలు ప్రభావవంతంగా పనిచేయడంతో హృద్రోగ ముప్పు తగ్గుతుంది. తృణధాన్యాలు రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహ నియంత్రణకు, బరువు తగ్గడంలోనూ ఉపకరిస్తుంది. తృణధాన్యాల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ద్వారా క్యాన్సర్ ముప్పు సైతం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read More :
అప్పుడు నచ్చలేదు.. ఇప్పుడు కావాలనిపిస్తుంది.. నా ఆసక్తిని మా ఆయనకు ఎలా చెప్పాలి?