అప్పుడు నచ్చలేదు.. ఇప్పుడు కావాలనిపిస్తుంది.. నా ఆసక్తిని మా ఆయనకు ఎలా చెప్పాలి?
ఇదొక పూర్తి వ్యక్తిగత సమస్య. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీతో పంచుకుంటున్నాను. ఇరవై ఏండ్ల క్రితం మా వివాహమైంది. మా వారు నాకంటే పదేండ్లు పెద్ద. పెండ్లయిన కొత్తలో నాకు లైంగిక జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.
ఇదొక పూర్తి వ్యక్తిగత సమస్య. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీతో పంచుకుంటున్నాను. ఇరవై ఏండ్ల క్రితం మా వివాహమైంది. మా వారు నాకంటే పదేండ్లు పెద్ద. పెండ్లయిన కొత్తలో నాకు లైంగిక జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పిల్లల కోసమే సెక్స్ అనే అభిప్రాయం ఉండేది. ఆయనకు మాత్రం కోరికలు ఎక్కువే. దీంతో పక్కచూపులు చూసేవారు. నేనూ అర్థం చేసుకుని సర్దుకుపోయేదాన్ని. ఈ మధ్య నాలో లైంగిక వాంఛ అధికం అవుతున్నది. ఆయన మాత్రం పాత జీవితానికి స్వస్తి చెప్పి.. నిర్మోహంతో బతికేస్తున్నారు. నా ఆసక్తిని ఆయనకు ఎలా చెప్పాలి, ఎలా ఒప్పించాలి?
ఓ పాఠకురాలు
కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం, జీవితానుభవాలు.. లైంగికత పట్ల మన అభిప్రాయానికి కారణం అవుతాయి. ‘పిల్లల కోసమే సెక్స్’ అనే అభిప్రాయానికి కూడా మూలకారణం అదే కావచ్చు. దానికితోడు పిల్లల పెంపకం, కుటుంబ బాధ్యతలలో తలమునకలైపోయి.. లైంగిక అవసరాలకు చిట్టచివరి స్థానం ఇస్తుంది మహిళ. పిల్లలు ఎదిగాక, బాధ్యతలు తగ్గాక అణగారిన వాంఛలు మళ్లీ పురులు విప్పుతాయి. మీ విషయంలో జరుగుతున్నది ఇదే. పెరిగిపోతున్న వయసు కావచ్చు, అనుభవించాల్సిన సుఖాలన్నీ అనుభవించాననే సంతృప్తి కావచ్చు. మొత్తానికి, మీ ఆయన అస్త్ర సన్యాసం చేశారు. ప్రతి విషయాన్నీ మాటల్లో చెప్పాల్సిన పన్లేదు. కొన్నిసార్లు కంటిచూపు సరిపోతుంది. కొన్నిసార్లు పెదవి విరుపూ సరిపోతుంది. ఏకాంతవేళ సంభాషణల్ని సరసం వైపు మళ్లించండి. లైంగికతనే కాదు, ఆయన సాన్నిహిత్యాన్ని కూడా ఆస్వాదించండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

