కీవ్: మారియపోల్ మారణహోమానికి ఈ వీడియోలే నిదర్శనం. బాంబుల వర్షంతో మోత మోగి.. ఇప్పుడు శిథిలాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వేల సంఖ్యలో బిల్డింగ్లు నేల మట్టం అయ్యాయి. నగరమంతా నిర్మానుస్యాన్ని తలపిస్తోంది. మారియపోల్ నగరంలో ఇంకా వేల మంది మంది ఆ శిథిలాల్లోనే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన 45 బస్సులను రష్యా దళాలు అడ్డుకున్నాయి. నగరంలో డ్రోన్లు తీసిన వీడియోలు కలిచివేస్తున్నాయి. అక్కడ జరిగిన విధ్వంసం పెను విషాదానికి ఉదాహరణ. ఇంకా ఆ నగరంలో లక్ష మందికిపైగా చిక్కుకున్నారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నీళ్లు, విద్యుత్తు లేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్ జీరో లెవల్ ఉష్ణోగ్రతల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఆహార నిల్వలు, మందులు అడుగంటాయి. బేస్మెంట్లో ఉంటూనే వారంతా వంట చేసుకుంటున్నారు.
This is what Putin thinks the #Russian world should looks like. Drone footage shot in the destroyed city of #Mariupol. pic.twitter.com/Y8Xple2SIp
— NEXTA (@nexta_tv) March 30, 2022
📽️Russkiy mir in its full beauty. #Mariupol pic.twitter.com/a3GTF7HXzs
— MilitaryLand.net (@Militarylandnet) March 31, 2022