న్యూయార్క్: మనుషుల వయసును రివర్స్ చేయడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నా ఫలితం మాత్రం శూన్యం. కానీ, ఓ సముద్ర జీవికి మాత్రం వయసును రివర్స్ చేసుకునే లక్షణాన్ని ప్రకృతే ఇచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. అట్లాంటిక్ కోంబ్ జెల్లీ సముద్ర జీవిలో ఈ అరుదైన లక్షణం ఉన్నట్టు తేల్చారు. దీనిని ‘సీ వాల్నట్’ అని కూడా పిలుస్తారు. గాయపడినప్పుడు, ఆహారం లభించడం కష్టమై ప్రాణానికే ముప్పు వాటిల్లినప్పుడు ఇవి వాటి శరీరాన్ని లార్వా దశకు మార్చగలవని పరిశోధకులు గుర్తించారు.