ఆదివారం 09 ఆగస్టు 2020
International - Jul 11, 2020 , 14:10:12

జారిపడి..ప్రపోజ్‌ చేశాడు..వీడియో వైరల్‌

జారిపడి..ప్రపోజ్‌ చేశాడు..వీడియో వైరల్‌

లవ్‌ ప్రపోజ్‌ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరూ పువ్వు అందించి, కొంతమంది రింగ్‌ ఇచ్చి ప్రేమను వ్యక్తపరిస్తే..మరికొందరేమో తన ప్రియురాలికిష్టమైన వస్తువులను ఇచ్చి ప్రపోజ్‌ చేస్తారు. లొగాన్‌ జాక్సన్‌ అనే వ్యక్తి తన ప్రియురాలు మరియా గిగ్లియొట్టాను సరికొత్తగా ప్రపోజ్‌ చేయాలని ఉత్తరమెరికా గ్రాండ్‌ హెవెన్‌లోని మిచిగాన్‌ సరస్సుకు తీసుకెళ్లాడు. మరియా వెంట పెట్‌ కూడా ఉంది. మరియా తీరం అంచున నీటిలోకి వెళ్లింది. వెంటనే జాక్సన్‌ ఉంగరం ఉన్న బాక్స్‌ను ఆమె దగ్గరకు పట్టుకుని నీటిలోకి వెళ్లాడు. నీటి అడుగునున్న పీచుపై కాలు పడటంతో జాక్సన్‌ జారి కిందపడ్డాడు.

కింద పడ్డ విషయాన్ని మరిచిపోయి మళ్లీ వెంటనే నీటిలో నుంచి పైకి లేచి..వెంట తీసుకొచ్చిన రింగ్‌ను ప్రియురాలి చేతికి తొడిగి పెళ్లి చేసుకోవాలని కోరాడు . ఇంత కష్టపడి ప్రపోజ్‌ చేసిన తర్వాత ఏ ప్రియురాలైన నో చెప్తుందా..? ఇంకేముంది జాక్సన్‌, మరియా సాగర తీరాన ప్రేమసాగరంలో మునిగిపోయారు. సెకన్ల వ్యవధిలో జాక్సన్‌ కింద పడ్డ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. logo