Mexican President | మెక్సికన్ అధ్యక్షురాలు (Mexican President) క్లాడియా షీన్‌బామ్‌కు ( Claudia Sheinbaum) చేదు అనుభవం ఎదురైంది. హిస్టారిక్ డౌన్‌టౌన్ (downtown)లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ప్రజలతో సంభాషిస్తున్న సమయంలో ఆమె పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పబ్లిక్‌లో అధ్యక్షురాలిని పట్టుకుని ముద్దు (kiss) పెట్టేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా తాకేందుకు కూడా ప్రయత్నించాడు. అతడి చర్యతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. భద్రతా సిబ్బంది కూడా తక్షణమే ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో అతడు రెచ్చిపోయి ప్రవర్తించాడు. కాసేపటికి సెక్యూరిటీ జోక్యం చేసుకొని అతడిని పక్కకు లాగారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని, అధ్యక్షురాలి భద్రతపై ప్రశ్నలను రేకెత్తించింది.
CRAZY moment man GROPES Mexico’s President Claudia Sheinbaum
Then TRIES to kiss her before security finally wakes up
How was security THIS slow to react? pic.twitter.com/vaECXy0bCW
— RT (@RT_com) November 4, 2025
Also Read..
Philippines | భూకంపం నుంచి కోలుకోకముందే ఫిలిప్పీన్స్‌లో వరదలు బీభత్సం.. 90 మంది మృతి