Viral video: రైలు వస్తుండగా పట్టాల మీదకు మహిళను తోసేశాడు.. తర్వాత ఏమైందంటే?

బ్రస్సెల్స్ : రైల్వే స్టేషన్లోకి రైలు వస్తుండగా ఒక వ్యక్తి మహిళను పట్టాల మీదకు తోసివేశాడు. అయితే అద`ష్టవశాత్తు ఆ మహిళ ప్రాణాలతో బయటపడింది. ఒళ్లు జలదరింపజేసే ఈ ఘటన బెల్జియంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం బ్రస్సెల్స్‌లోని రోజియర్ మెట్రో స్టేషన్లో రైలు కోసం ఒక మహిళ ఫ్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్నది. రైలు స్టేషన్లోకి వస్తుండగా, నల్లటి టీ-షర్టు ధరించిన ఒక వ్యక్తి ఆ మహిళను వెనుక నుంచి రైలు పట్టాల మీదకు తోసేశాడు. అదుపుతప్పిన ఆ మహిళ, స్టేషన్లోకి ఎంట్రన్ అవుతున్న రైలు ముందు ఉన్న పట్టాలపై పడింది.
కాగా, క్షణాల్లో దీనిని గమనించిన రైలు డ్రైవర్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. దీంతో ఆ రైలు మహిళకు అంగుళం దూరంలో ఆగింది. దీంతో ఆమెకు వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. గమనించిన తోటి ప్రయాణికులు వెంటనే అక్కడకు పరుగున వచ్చారు. షాక్‌లో ఉన్న ఆ మహిళను ఫ్లాట్‌ఫామ్‌పైకి చేర్చేందుకు సహకరించారు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మహిళను ఉద్దేశపూర్వకంగా రైలు ముందుకు తోసిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అతడ్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి మానసిక పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. కాగా, రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించి 30 సెకండ్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
(⚠️Vidéo choc)
— Infos Bruxelles🇧🇪 (@Bruxelles_City) January 14, 2022
Tentative de meurtre dans la station de métro Rogier à Bruxelles ce vendredi vers 19h40. pic.twitter.com/dT0ag5qEFu
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

