సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వీడియోలను చూసి షాక్ అవ్వాల్సిందే. తాజాగా ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి.. ఏకంగా మొసలితో డ్యాన్స్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో షేర్ అయిన ఈ వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. నడుము లోతు నీళ్లలో ఓ వ్యక్తి మొసలిని కౌగిలించుకొని దానితో డ్యాన్స్ చేశాడు.
దానితో ఎంతో సరదాగా ఉన్న ఆ వ్యక్తి.. ఏమాత్రం దాన్ని చూసి జంకలేదు. మొసలి కూడా సరదాగా ఆ వ్యక్తితో డ్యాన్స్ వేయడంతో నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారు. ఒక్క ఫ్లొరిడాలోనే మీరు మొసలితో డ్యాన్స్ చేసే వ్యక్తిని చూడగలరు.. అంటూ క్యాప్షన్ పెట్టి ఈ వీడియోను షేర్ చేశారు.