మాలె: అవినీతి ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసుల్లో మాల్దీవుల మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు 11 ఏండ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ ఆదివారం మాల్దీవుల క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.
జైలు శిక్షతో పాటు ఐదు మిలియన్ల డాలర్ల జరిమానా కూడావిధించింది. మనీ లాండరింగ్ కేసులో ఏడేళ్ల జైలు, అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2018లో ప్రస్తుత మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిపై పోటీ చేసి యమీన్ ఓడిపోయారు.