మాస్కో: రష్యాలోని (Russia) కామ్చట్కా ద్వీపకల్పం వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి దాటాక భారీగా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. అనంతరం 5.8 తీవ్రతతో మరోసారి ప్రకంపణలు వచ్చాయి. దీంతో అధికారులు సునామీ వార్నింగ్ జారీ చేశారు. అన్ని ఎమర్జెన్సీ సర్వీసులను హై అలర్ట్‌లో ఉంచారు. ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు.
ఈ నెల 14న కూడా కామ్‌చట్కాలో7.4 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కీ నగరానికి తూర్పున111 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆగస్టు 5న కూడా భూమి కంపించింది. కామ్చట్కా తీరంలో (Kamchatka Coast) 6.0 తీవ్రతతో ప్రకంపణలు వచ్చాయి. అంతకుముందు జూలై 30న 8.8 తీవ్రతతో కామ్చట్కా (Kamchatka) ద్వీకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్‌లో 6.5 తీవ్రతతో భూమి కంపించింది.
మరోవైపు ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో శుక్రవారం తెల్లవారుజామున ప్రకంపణలు వచ్చినట్లు యూఎస్జీఎస్ వెల్లడించింది. 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది.