Earthquake | తైవాన్ను భారీ భూకంపం వణికించింది. తూర్పుతీరంలో శుక్రవారం తెల్లవారుజామున బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. హువాలియన్ (Hualien) నగరానికి 34 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
భూమికి 9.7 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలో అక్కడ సంభవించిన రెండో భూకంపం ఇది. ఈ భూకంపం ధాటికి రాజధాని తైపీ (Taipei)లో భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Another earthquake jolted #taiwan. Hope it’s not devastating.I captured this video at work. #Earthquake #EarthquakeinTaiwan #TaiwanEarthquake pic.twitter.com/jVu8BdVf17
— Suvam Pal শুভম পাল शुभम पाल 蘇旺 (@suvvz) August 15, 2024
Magnitude 6.3 earthquake jolts Taiwan
In APAC region earthquake becomes new normal 😳 #earthquakes #earthquake #Taiwan #Taipei pic.twitter.com/GXMQbep4Xl— Param Choudhary (@Param_117) August 16, 2024
Also Read..
Assembly Polls | దేశంలో మరోసారి మోగనున్న ఎన్నికల నగారా.. నాలుగు రాష్ట్రాలకు నేడు షెడ్యూల్ ప్రకటన..!
SSLV-D3 | ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం విజయవంతం
Medical Students | ఒత్తిడితో వైద్య విద్యార్థుల చిత్తు.. నలుగురిలో ఒకరికి మానసిక సమస్యలు: ఎన్ఎంసీ