టోక్యో, అక్టోబర్ 5: జపాన్లో 6.0 తీవ్రతతో భూకంపం ఏర్పడింది. శనివారం రాత్రి హూన్షు తూర్పు తీరంలో 50 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది.
అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, అయితే కొన్ని చోట్ల భవనాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. కాగా, జపాన్ దేశానికి భూకంపాలు, అగ్ని పర్వతాలు కొత్త కాదు.