మిసిసిపీ: అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన ఓ వేటగాళ్ల గుంపునకు భారీ మొసలి చిక్కింది. ఇంత పొడవైన మొసలి కనిపించడం చరిత్రలో ఇదే మొదటిసారని మిసిసిపీ రాష్ట్రానికి చెందిన వైల్డ్‌లైఫ్, ఫిషరీస్ అండ్ పార్కుల విభాగం తెలిపింది. ఆ మొసలి బరువును తూకం వేయగా 802.5 పౌండ్లు అంటే 364 కిలోలు ఉన్నది. పొడవు 14 అడుగుల మూడు అంగుళాలు ఉన్నది. గతంలో 14 అడుగుల రెండు అంగుళాల పొడవే రికార్డుగా ఉన్నది. దానికంటే ఇప్పుడు పట్టుబడ్డ మొసలి మరో అంగుళం పొడవు ఎక్కువగా ఉన్నది.
మిసిసిపీలోని యాజూ సిటీలో ఎలిగేటర్ హంటింగ్ జోన్లో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో ఆఖరి శుక్రవారం నుంచి మొసళ్ల వేట ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాలుగుతో ఈ వేట ముగిసింది. ఈ క్రమంలో ఈ నెల 2న దొరికిన భారీ మొసలితో ఆ నలుగురు వేటగాళ్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.