London | లండన్ (London) హీత్రో విమానాశ్రయంలో (Heathrow Airport) విమానయాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. భారీ అగ్ని ప్రమాదం కారణంగా ఇక్కడ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. చివరికి పరిస్థితులు మెరుగు పడటంతో.. 18 గంటల అనంతరం హీత్రో ఎయిర్‌పోర్ట్‌లో విమానాయాన సేవలను అధికారులు పునరుద్ధరించారు (Flight Operations resume).
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం సమీపంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ఈ అంతర్జాతీయ ట్రావెల్ హబ్ నుంచి రాకపోకలు సాగించే 2.90 లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 1,350 విమానాలను రద్దు చేశారు.కొన్ని విమానాలను అవి ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే తిప్పి పంపారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదు. ఈ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని పోలీసులు వెల్లడించారు.
Also Read..
Heathrow Airport: లండన్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. హీత్రూ విమానాశ్రయం బంద్
Donald Trump | సునీతా విలియమ్స్‌కు ఓవర్‌టైమ్ జీతం సొంత డబ్బుతో చెల్లిస్తా : డొనాల్డ్ ట్రంప్
India | అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి.. విద్యార్థులకు భారత్ కీలక సూచన