లండన్: లండన్ నగరంలోని హీత్రూ విమానాశ్రయాన్ని(Heathrow Airport) బంద్ చేశారు. గురువారం రాత్రి నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఓ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 16 వేల ఇండ్లకు విద్యుత్తు నిలిచిపోయింది. లండన్ ఫైర్ బ్రిగేడ్ ప్రమాద స్థలానికి 10 ఫైరింజన్లను, 70 మంది అగ్నిమాపక సిబ్బందిని పంపించింది. 300 మీటర్ల మేర సేఫ్టీ కార్డన్‌ను ఏర్పాటు చేశారు.
హీత్రూ విమానాశ్రయం ప్రయాణికులకు హెచ్చరిక చేసింది. సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో టచ్‌లో ఉండాలని పేర్కొన్నది. విమానాశ్రయానికి విద్యుత్తును సరఫరా చేసే ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం జరిగిందని, ఎయిర్‌పోర్టుకు తీవ్రమైన కొరత ఉందని, ప్రయాణికుల సేఫ్టీ కోసం హీత్రూ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు.
ఇప్పటికే అనేక విమానాలను డైవర్ట్ చేశారు. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో జరిగిన ప్రమాదం వీడియోలను ఆన్లైన్లో పోస్టు చేశారు. శుక్రవారం పూర్తిగా హీత్రూ విమానాశ్రయాన్నిమూసి వేస్తున్నారు. బ్రిటన్‌లో అతిపెద్ద విమానాశ్రయం హీత్రూ. ప్రతి రోజు సుమారు 1300 ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లు ఉంటాయి. గత ఏడాది ఆ ఎయిర్‌పోర్టు నుంచి 83.9 మిలియన్ల మంది ప్రయాణించారు.
📹 POWER BLAZE IN LONDON SHUTS DOWN UK’S BUSIEST AIRPORT, HEATHROW – REPORTS
Firefighters are struggling to contain a major blaze at the Hayes electrical substation, causing evacuations and widespread power outages, Sky News reported.
Videos from social media pic.twitter.com/XwfAopJYvq
— Sputnik (@SputnikInt) March 21, 2025