లండన్: తమ దేశంలోని తమ పౌరులు, శాశ్వత నివాసులు ఉద్యోగం పొందాలంటే తప్పనిసరిగా తమ డిజిటల్ ఐడెంటిఫికేషన్ కార్డులను సమర్పించాలని బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ శుక్రవారం ప్రకటించారు. దేశ సరిహద్దులపై ప్రభుత్వానికి నియంత్రణ ఉందని చెప్పుకోవడం కోసం ఆయన ఈ వివాదాస్పద ఆలోచనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే, డిజిటల్ ఐడీని సమర్పించనివారు చట్టవిరుద్ధ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాన్ని పొందడం కష్టమవుతుందని, తద్వారా అక్రమ వలసలను తగ్గించవచ్చునని బ్రిటన్ ప్రభుత్వం చెప్పింది.