Lioness Jumps on Man | సాధారణంగా సింహాలు, పులుల జోలికి ఎవ్వరూ పోరు. అడవుల్లో అవి ఉన్నాయంటే నరమానవుడు కూడా వాటి దగ్గరికి పోడు. పోతే అంతే.. ఇక తిరిగి వస్తామా? వాటికి ఆహారం కావాల్సిందే. వాటిని చూడాలంటే జూలో ఎన్‌క్లోజర్‌లో అవి ఉన్నప్పుడు వాటిని బయటి నుంచి మనం చూసి ఆనందించడమే.
అయితే.. ఈ మధ్య పులులు, సింహాలను కూడా పెంపుడు జంతువులలా కొందరు పెంచుకుంటున్నారు. కాకపోతే.. వాటిని ఇంట్లో ఉంచుకోవడానికి వీలు లేదు. వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్స్ ఉన్న జూలోనే ఉంచాల్సి ఉంటుంది.
అడవుల్లో ఉండే జంతువులు అయితే.. ఆహారం కోసం అడవి అంతా గాలించాల్సి ఉంటుంది. కానీ.. జూలలో ఉన్నవి, పెంచుకునే వాటికి తిండికి డోకా ఉండదు. వాటికి ఆహారం.. వాటి బాగోగులు చూసుకునేవాళ్లే అందిస్తారు. అక్కడే అవి వాళ్లతో స్నేహం చేస్తుంటాయి. వాటిని చిన్నప్పటి నుంచి చూసుకున్న వాళ్లను అవేం చేయవు.
అలాంటి ఓ సింహం గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది. అది ఆడ సింహం. సౌత్ ఆఫ్రికాలోని బోత్సువానాలో ఉన్న కలహారి ఎడారిలో ఉన్న ఓ జూలో ఇది ఉంటుంది. దాని పేరు సిర్గా. దీని కేర్ టేకర్ వాల్ గ్రుయెనర్.
ఆ సింహం వయసు ఇప్పుడు 9 ఏళ్లు. అది చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి దాని బాగోగులు వాల్ చూసుకున్నాడు. అందుకే అతడు దాని దగ్గరకు రాగానే అది ఆగదు. అతడితో ఉన్నంత సేపు చాలా సరదాగా గడుపుతుంది సిర్గా. అతడితో ఫ్రెండ్షిప్ చేస్తుంది. దానితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను వాల్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.
ఇటీవల వాల్ దాని దగ్గరికి వెళ్లినప్పుడు దాని ఎన్‌క్లోజర్ ఓపెన్ చేశాడు. అంతే.. ఒక్క ఉదుటున ఎగిరి గంతేసి అతడి మీద పడింది ఆ సింహం. దీంతో అతడు కూడా కిందపడ్డాడు. ఆ తర్వాత పైకి లేచి.. దానితో కలిసి కాసేపు షికారు చేశాడు. దానికి సంబంధించిన వీడియోను కూడా వాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పీటల మీదే పెళ్లి కూతురును లాగి.. ముద్దు పెట్టి పెళ్లికొడుకు రచ్చ: వీడియో వైరల్
Viral Video | మూడు కోబ్రాలు ఒక చోటుకు చేరి వింత చేష్టలు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు