వాషింగ్టన్, జూలై 9: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన సామాజిక మాధ్యమం ఎక్స్ సీఈవో లిండా యాకారినో బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. 44 బిలియన్ డాలర్లకు 2023 మేలో ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేసిన తర్వాత యాడ్ వెటరన్ ఎగ్జిక్యూటీవ్‌గా ఉన్న ఆమెకు సీఈవోగా బాధ్యతలు అప్పగించారు.
ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా పేరు మార్చుకున్న ఈ మాధ్యమాన్ని ఆమె రెండేళ్ల పదవీకాలంలో విజయవంతంగా నిర్వహించారు. మస్క్ కృత్రిమ మేధస్సు సంస్థ ఎక్స్ఏఐ, చాట్‌బాట్ గ్రోక్లతో ఎక్స్ కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టారని, అందులో ఉత్తమమైనది ఇంకా రాలేదని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ‘మీ సహకారానికి ధన్యవాదాలు’ అని మస్క్ ఆమెను ప్రశంసిస్తూ మెసేజ్ పెట్టారు.