Sardinia | న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ అనుసరించబోయే విధానాల పట్ల బెంగపెట్టుకుని, దేశం నుంచి వెళ్లిపోవాలని కొందరు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని ఇటలీలోని సార్డీనియా దీవి అధికారులు గొప్ప అవకాశంగా భావించారు. తక్కువ జనాభా ఉన్న తమ దీవికి రావాలని విదేశీయులకు వీరు ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అందుకే, అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల వల్ల దిగ్భ్రాంతికి గురైనవారికి కూడా భారీ ఆఫర్‌ను ప్రకటించారు.
శిథిలమైన ఇళ్లను అమెరికన్లకు కేవలం 1 డాలర్‌కే అమ్ముతామని తెలిపారు. ఆమెరికన్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. నూతన అవకాశాలను పొందడంతోపాటు, మరింత సమతుల్యత గల జీవన శైలి కోసం చూస్తున్నారా? సార్డీనియా స్వర్గధామంలో మీ యూరోపియన్ జీవితాన్ని నిర్మించుకోవడం ప్రారంభించడానికి ఇదే సరైన సమయం! అని ప్రచారం చేస్తున్నారు.